Category
ఒంటిపూట బడులు | half-day school from
Telangana 

Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. జీవో జారీ! ...

Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. జీవో జారీ! ... హైదరాబాద్ -సూర్య టుడే:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వేసవి ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మాత్రమే తరగతులను నిర్వహించాలని సూచించింది. మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు భోజనం అందించాలని సూచించింది. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో పరీక్ష నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులను నిర్వహించాలని పేర్కొంది. ఈ విద్యాసంవత్సరం చివరిరోజైన ఏప్రిల్‌ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది.
Read More...