కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా?
ప్లాన్ చేస్తుంది ఎవరు?

తెలంగాణ-సాయిసూర్య:తెలంగాణలో మరో సారి ప్రభుత్వం కూల్చివేత అంశం తెరపైకి వచ్చింది. గతంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఈ అంశంపై తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి. మెజార్టీ ఉన్నప్పటికీ నేతలందరు బయటికి వచ్చి రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కౌంటర్ ఎటాక్ తో కాస్త సద్దుమణిగింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలో మరోసారి అగ్గిరాజుకుంది.
కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వానికి అవసరమైన మెజార్టీ సభ్యులను గెలుచుకొని అధికారం చేపట్టింది. ఆ తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది. భారీ మెజార్టీలో లేదు. ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోతారని కొందరు జోస్యం చెప్పారు. కానీ అవన్నీ ఉత్తి మాటలుగానే మిగిలిపోయాయి. ఇన్నాళ్లకు బీఆర్ఎస్ మరోసారి ఈ ప్రచారానికి ఊపందించింది.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కొందరు పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు డబ్బులిచ్చి పడగొడతామని అంటున్నారని కొత్త ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అటు కాంగ్రెస్ నుంచి కూడా అంతే వేడిగా కౌంటర్లు వస్తున్నాయి.
ఐతే ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ మంత్రులు, నేతలు, ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను, భూ భారతి అంశాలను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసిందంటున్నారు.
ఇదిలా బీఆర్ఎస్-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని కూల్చుతాయని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మరునాడే బీఆర్ఎస్ నేతలు ఈ వ్యాఖ్యలు చేయడంపై అనేక విధాలుగా చర్చలకు కారణమైంది. ప్రధాని మోదీ హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గ్యారంటీలు నెరవేర్చలేకపోతోందన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ చర్యలపై చేసినప్పటికీ...మరునాడే బీఆర్ఎస్-బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తాయని పుకార్లు షికారు చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీ అనేక రాష్ట్రాల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేసింది...కాబట్టి ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. ఐతే ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదన్నారు. కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదన్నారు. ఇలా నేతలు ఈ అంశాన్ని ఖండిస్తున్నప్పటికీ..తీవ్ర చర్చ కొనసాగుతోంది.