మంత్రి పదవి ఆశవహులకు సీఎం రేవంత్ కౌంటర్

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటీ?

On
మంత్రి పదవి ఆశవహులకు సీఎం రేవంత్ కౌంటర్


ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసహనం

జానారెడ్డితో సమావేశం తర్వాత సీఎం వ్యాఖ్యలు

సీఎం మాటలనే ఎమ్మెల్యేలు పెడచెవిన పెడుతున్నారా? తీరు మార్చుకోకపోతే నష్టమేనా? తెలంగాణ అధికార పార్టీలో ఏం జరుగుతోంది.  ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి వ్యాఖ్యల మర్మమేమిటీ? మరోసారి ఆ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు ఎవరిని ఉద్దేశించినవి.? 

రాష్ట్రానికి సుప్రీమ్ ముఖ్యమంత్రి. ఆయన సంతకం, ఆయన ఆదేశంతోనే పాలన సాగుతుంది. ఒక్క ఇషారా చేస్తే చాలు...అన్ని పనులు జరిగిపోతాయి. ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులందరూ ఇదే కొనసాగించారు. కానీ తెలంగాణలో ఇప్పుడు అధికార పార్టీలో ఆ ధర్పణం లేదా? సీఎం రేవంత్ రెడ్డి మాటలను కొంతమంది పెడచెవిన పెడుతున్నారా అంటే..అవుననే సమాధానం ముఖ్యమంత్రి వ్యాఖ్యలతోనే అర్థం అవుతోందంటున్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. జానారెడ్డితో మావోయిస్టుల శాంతి చర్చల అంశం, పీస్ కమిటీ వినతి పత్రం తదితర అంశాలపై చర్చించారు. జానారెడ్డితో పాటు కే.కేశవరావు కూడా ఉన్నారు. కేకే, జానారెడ్డి పార్టీలో చర్చిస్తారని, కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకుంటారని సీఎం తెలిపారు. అలాగే అప్పట్లో మావోయిస్టులతో జరిగిన చర్చల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. 

ఇక ఆ సమావేశం తర్వాత సీఎం మీడియాతో చిట్ చాట్ లో చాలా విషయాలు పంచుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ రజతోత్సవ సభలో కామెంట్లకు స్పందించారు. ఇక పనిలో పనిగా ఎమ్మెల్యేల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసహనం
ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉంటూ టైమ్ పాస్ చేయడం సరికాదన్నారు. అంతేకాదు పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లాలని సూచించారు. ఐతే ఈ మధ్య మంత్రిపదవుల అంశం పార్టీలో అగ్గిరాజేసింది. కొందరు అశవహులు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. కొంతమంది హెచ్చరికలు కూడా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా సీనియర్ నేత జానారెడ్డిని విమర్శించారు. దృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ తర్వాత ఇన్ ఛార్జీ మీనాక్షి నటరాజన్ కు వివరణ కూడా ఇచ్చుకున్నారు. అలాగే మల్ రెడ్డి రంగారెడ్డి, శ్రీహరి, ప్రేమ్ సాగర్ రావు వంటి ఆశవహులు సైతం విమర్శల దాడి చేశారు. ఈ పరిణామాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్తూ...సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనూ ఎమ్మెల్యేలను క్లాస్ పీకారు. కానీ తీరు మారలేదని ఇప్పుడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఐతే జానారెడ్డిని కలిసింది మావోయిస్టుల శాంతి చర్చల అంశం అయినప్పటికీ...రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కూడా నేతల మధ్య చర్చకు వచ్చిందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పార్టీలో నేతలు.    

జానారెడ్డితో సమావేశం తర్వాత సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మం ఏమిటని ఆలోచిస్తున్నారట. ఐతే తనను నమ్మిక అద్దంకి దయాకర్ వంటి వ్యక్తికి పదవి ఇప్పించానని...అలాగే మంత్రి పదవి ఆశిస్తున్నవారు సైతం నమ్మకం ఉంచాలని చెప్పకనే చెప్తున్నారా? అని చర్చించుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్లు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. 
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అదనపు బ్లాక్ భవన నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల నాయకత్వంలో జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటున్నామని తెలిపారు. ఐతే రాజగోపాల్ రెడ్డి ఈ తరహా కామెంట్లు చేయడం ఇది కొత్త కాదు. గతంలో చేసినప్పటికీ ...సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లు బయటికి వచ్చిన కాసేపటికే రాజగోపాల్ రెడ్డి మాట్లాడం చర్చకు దారి తీసింది. మంత్రి పదవి పక్కన పెడితే...ఆయన ఏకంగా సీఎంనే టార్గెట్ చేస్తున్నారా అని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయట. 

✍️✍️అవినీతి పై అక్షరం తూట సాయి సూర్య,

Views: 50

Latest News