TG CONGRESS:ఎంత మంచి చేసినా.. ఈ వ్యతిరేకత ఎందుకు?

సంక్షేమం అమలు చేసినా ఎక్కడ తక్కువ అవుతోంది.

On
 TG CONGRESS:ఎంత మంచి చేసినా.. ఈ వ్యతిరేకత ఎందుకు?

ప్రజలకు అందుబాటులో ఉన్నా ఎందుకు దగ్గర అవ్వకపోతున్నాం..?

ఇలాంటి ప్రశ్నలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయ్.

సాయిసూర్య, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఏడాదిన్నర కావొచ్చింది. ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయకపోయినా.. కొన్ని కార్యరూపం దాల్చాయి. సంక్షేమం కొనసాగుతోంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ పథకాలు కొనసాగిస్తున్నారు. అయినా కూడా కావలసిన, రావాల్సిన మైలేజ్ రావడం లేదు. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి, ప్రభుత్వానికి ప్రశ్నగా మారింది.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాఫీగానే సాగుతోంది. రాజకీయంగా ఏ సమస్యలు ఇప్పటికీ ఇప్పుడు లేవు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి... అయినా ఎలాగోలా నడిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నికలు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు,  రాజీవ్ యువ వికాసం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ లో సన్నబియ్యం, 200 వరకు ఉచిత కరెంట్, 500 రూపాయలకు గ్యాస్ వంటివి కొనసాగిస్తోంది. ఇక 2లక్షల వరకు రుణమాఫీ చేసింది. రైతు బంధు కూడా అమలు చేయబోతుంది. పింఛన్లు కొనసాగుతున్నాయి. వీటన్నిటికి ఆర్థికంగా కష్టంగా ఉన్న నెట్టుకొస్తుంది. ఈ పథకాలు కొనసాగుతున్నా...ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత మొదలైందట. 

ఇదిలా ఉంటే.. పాలన పరంగా.. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆయా శాఖల నిర్ణయాలు ఆ శాఖల మంత్రులే తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి అప్పుడప్పుడు రివ్యూ చేస్తూ.. సలహాలు సూచనలు ఇస్తున్నారు. మంత్రులు సైతం ఆ శాఖలపై పూర్తి పట్టు ఉంచుకున్నారు. ప్రభుత్వాన్ని మంత్రులంతా కలిసి.. ఉమ్మడిగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి సుపీరియర్ గా.. తాను ఆదేశించింది చేయాలి. అన్ని శాఖలకు నేనే బాస్ అన్న విధంగా.. గత ప్రభుత్వం వ్యవహరించినట్టు కాకుండా.. కలిసి పాలన సాగిద్దాం అని రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇక నిత్యం కాకున్నా..ఉండాల్సిన సమయంలో సచివాలయంలో సీఎం అందుబాటులో ఉంటున్నారు. సచివాలయంలో లేకపోతే జూబ్లీ హిల్స్ నివాసంలో రివ్యూలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతకైనా, ప్రతిపక్షానికైనా అందుబాటులో ఉంటున్నారు. కానీ వ్యతిరేకత మాత్రం వ్యక్తం అవుతూనే ఉంది. 

ప్రభుత్వంపై ఈ వ్యతిరేకతకు కారణం ఏంటి.?
కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా స్వచ్చమైన పాలన సాగిస్తుందని ఎవరూ చెప్పడం లేదు. తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీకి నష్టం కలిగించాయి, కలిగిస్తున్నాయి. ఐతే వాటిని అధిగమించాల్సింది. కానీ ఆ దిశగా ఆలోచన చేయలేకపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

ప్రభుత్వ నిర్ణయాలే కాదు...ప్రజల్లోకి వాటిని బలంగా తీసుకెళ్లే...వ్యవస్త కూడా కీలకంగా ఉంటుంది. మంత్రులుగా సీనియర్లు ఉన్నారు.. వారు స్వేచగ పనిచేసే పరిస్తితి ఉంది. కానీ ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతున్నారు. దీనికి మంత్రుల లోపమే కారణంగా కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయడం లేదు. ప్రజల వద్దకు వెళ్లి.. సమస్యలు తీసుకోవడం లేదు. ఇక తమ వర్గం, కేడర్ కే ప్రాధాన్యం ఇవ్వడం కూడా మైనస్ గా మారుతోంది. ఇక ఎమ్మెల్యేల పాత్ర కూడా ఇందులో కీలకం. ప్రభుత్వం చేస్తున్న మంచిని తమ నియోజకవర్గంలో ప్రచారం కల్పించకపోవడం, లబ్ధిదారులకు పథకాలు అందక పోవడం కూడా కారణంగా ఉన్నాయి అంటున్నారు. ఎమ్మెల్యేలు ఎంతసేపు సొంత పనులే తప్ప.. ప్రజల సమస్యలు తీర్చేందుకు సమయం కేటాయించక పోవడం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకతను మూటగడుతున్నాయి అని చర్చ జరుగుతోంది. 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం డిజిటల్, సోషల్ మీడియా యుగం నడుస్తుంది. సోషల్ మీడియా వాడకంలో కాంగ్రెస్ కాస్త వెనుక పడింది. బిఆర్ఎస్ సోషల్ మీడియాను ఎదుర్కోలేక పోతోంది. చేసిన మంచిని సోషల్ మీడియా వేదికగా ప్రచారం కలిపించుకోలేక పోతోంది. ఇక ప్రతిపక్షాల విమర్శలు, పోరాటాలు సరేసరి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను, పనులను, విమర్శిస్తూనే ఉన్నాయి. చేసిన మంచికంటే.. ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతం జనాల్లోకి బలంగా వెళ్తోంది. దీంతో ఇలా ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Views: 223

Latest News

illegal constructions:అడ్డుఅదుపులేని అక్రమ నిర్మాణాలు రోడ్లు, ప్రధాన కూడళ్లను ఆక్రమించి రేకుల షెడ్లు illegal constructions:అడ్డుఅదుపులేని అక్రమ నిర్మాణాలు రోడ్లు, ప్రధాన కూడళ్లను ఆక్రమించి రేకుల షెడ్లు
తుర్కయంజాల్ -సూర్య టుడే:పట్టణాల అభివృద్ధికి  ప్రణాళికలే ప్రాధాన్యం. ప్రణాళిక లేని నిర్మాణం అస్తవ్యస్థం, భవిష్యత్ ఆగమాగం. రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీగా ఉన్న తుర్కయంజాల్ మున్సిపాలిటిలో ప్రణాళికలు...
మంత్రి పదవి ఆశవహులకు సీఎం రేవంత్ కౌంటర్
బీఆర్ఎస్ పార్టీకి హరీశ్ రావు దూరం అవుతున్నారా? 
రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్: కేసీఆర్
సాయిసూర్య చెప్పిందే నిజమైంది
Silver Jubilee public meeting:సిల్వర్ జూబ్లీ బహిరంగ సభనువిజయవంతం చేయాలి :చెవుల దశరథ
శ్రీ శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సమావేశం..