శివన్నామస్మరణంతో మారుమోగిన ఆలయాలు

On
శివన్నామస్మరణంతో మారుమోగిన ఆలయాలు

శివన్నామస్మరణంతో మారుమోగిన ఆలయాలు

కొండమల్లేపల్లి- సూర్య టుడే  :మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొండమల్లేపల్లి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు కొండమల్లేపల్లి చౌరస్తాలో గల శ్రీ సీతారామచంద్రమౌళీశ్వర దేవాలయంలో బుధవారం శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటి, పురోహితుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున పురోహితులు దేవత మూర్తుల విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు భారీ ఎత్తున పాల్గొని శివనామస్మరణంతో కొండమల్లేపల్లి పట్టణం మారుమోగేలా అంగరంగ వైభవంగా ఘనంగా పూజలు నిర్వహించారు .ముఖ్యంగా శివుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ నాయని మాధవరెడ్డి మాట్లాడుతూ హిందువులు కుటుంబ సమేతంగా వచ్చి ఆలయాలలో పూజలు నిర్వహించడం వలన మానసిక ప్రశాంతత తో పాటు ఐక్యత, మంచి నడవడిక ఏర్పడుతుందన్నారు. మన భావితరాల పిల్లలకు భారతీయ సంస్కృతిని అందజేసిన వారం అవుతామన్నారు. భారతదేశం మన హిందూ మతంలో గొప్ప సంప్రదాయాన్ని అందించిందన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్ష, జాగరణ ,భజన కార్యక్రమాలుంటాయన్నారు.

Views: 28

Latest News

Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. జీవో జారీ! ... Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. జీవో జారీ! ...
హైదరాబాద్ -సూర్య టుడే:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వేసవి ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ మేరకు ప్రభుత్వం...
Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
TUWJ(IJU ):టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి
Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆర్ధికసాయం అందజేత
CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు
గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌
YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌