Police showing humanity:మానవత్వం చాటుకున్న ఇన్ స్పెక్టర్  నాగరాజుగౌడ్

On
Police showing humanity:మానవత్వం చాటుకున్న  ఇన్ స్పెక్టర్  నాగరాజుగౌడ్
యూనిఫార్మ్‌లో మానవత్వంచాటుకున్న ఇన్ స్పెక్టర్ నాగరాజుగౌడ్

కేసుల విషయంలో కరకుగా వ్యవహరించడమే పోలీసులకు తెలుసని అనుకుంటారు. అది తప్పు అని అనేక సందర్భాలు తెలిపిన ఘటనలు ఉన్నాయి.  అలాంటిదే ఈ ఘటన.

హయత్‌ నగర్‌-సూర్యటూడే: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్‌ నగర్‌  పోలీసులు మానవత్వం తో స్పందించి ఓ ప్రాణం నిలిపారు.  హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్  పి. నాగరాజు గౌడ్,  డ్రైవర్ ఏఆర్‌పీసీ రామకృష్ణ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నారు. ఆ సమయంలో ఓ ప్రమాదంలో గాయపడి పడివున్న  మహిళను గమనించారు. వెంటనే స్పందించిన నాగరాజు గౌడ్ ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఐతే.. అంబులెన్స్ రావడానికి ఆలస్యం అవుతుందని.. పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో హాస్పిటల్ తీసుకెళ్లారు. ఐతే సమయానికి చికిత్స అందించడం తో ఆమె ప్రాణాలు నిలిచాయి. ఆలస్యం అయి ఉంటే ప్రాణాలకే ముప్పు ఉండేదని వైద్యులు చెప్పారు. 
  ఇన్ స్పెక్టర్  నాగరాజుగౌడ్ స్పందించిన తీరుపై వెల్లువెత్తుతున్నఅభినందనలు 

మానవత్వంతో ఆలోచించి ప్రాణాలు నిలిపిన వారికి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. పోలీసులు అంటే.. కోపం, రౌద్రమే కాదు.. మానవత్వం కూడా ఉంటుందని నిరూపించారని అంటున్నారు. వారి స్పందన ఒక జీవితాన్ని కాపాడింది అంటున్నారు. ఈ ఘటన పోలీసులపై మరింత గౌరవాన్ని పెంచింది. అలాగే రాచకొండ కమిషనరేట్ సేవా తత్వాన్ని ప్రజలకు మరింత తెలియజేసింది అని ప్రజలు చెప్తున్నారు. నాగరాజు గౌడ్, రామకృష్ణకు సెల్యూట్ చేస్తున్నారు.

Views: 125

Latest News