China:చైనా తెగువను చూసి నేర్చుకోవాలి ! 

On
China:చైనా తెగువను చూసి నేర్చుకోవాలి ! 

న్యూయార్క్‌:అమెరికా ఆశలు గల్లంతవుతున్నాయి. అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేస్తామన్న భరోసా లేకుండా పోయింది. మనం అమెరికాతో ఎంత సన్నిహతంగా ఉన్నా ట్రంప్‌ మాత్రం మనలను శతృవులుగానే చూస్తున్నారు. విదేశాల్లో సైతం మాంద్యం ఆవరించింది. ట్రంప్‌ సుంకాల పుణ్యమా అని అమెరికాతో పాటు ప్రపంచంలో ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం దాడి చేస్తోంది. ట్రంప్‌ను ఎదుర్కోవడంలో చైనా చూపిన తెగువ అభినందనీయం. అలాంటి ధైర్యం మనం చేయలేకపోతున్నాం. చైనా ప్రభుత్వం ఎగుమతుల కోసం కొత్త నియంత్రణ వ్యవస్థ, విధానాలను రూపొందిస్తోందని, కార్ల నుంచి క్షిపణుల దాకా అన్నింటి తయారీకి అవసరమయ్యే అయస్కాంతాల ఎగుమతుల్ని నిలిపేసినట్లు, అనేక చైనా ఓడరేవుల్లో షిప్‌మెంట్స్‌ ఉన్నట్లు ది న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిక తెలిపింది. నివేదికల ప్రకారం, కొత్త నియంత్రణ వ్యవస్థ అమలు లోకి వచ్చిన తర్వాత అమెరికన్‌ మిలిటరీ కాంట్రాక్టర్లతో సహా అన్ని కంపెనీలకు వస్తువులు చేరకుండా శాశ్వతంగా నిరోధించవచ్చని తెలుస్తోంది. అమెరికా చాలా వరకు చైనా దిగుమతుల పై ఆధారపడిరది. దీంతో చైనా ట్రంప్‌ సుంకాలకు ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. చైనా ప్రపంచంలోనే రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌లో దాదాపుగా 90 శాతం ఉత్పత్తిని కలిగి ఉంది. ఇది రక్షణ, ఎలక్ట్రిక్ర్‌ వాహనాలు,ఎనర్జీ అండ్‌ ఎలక్టాన్ర్రిక్స్‌ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. రేర్‌ ఎర్త్‌ మూలకాల్లో 17ఉన్నాయి. సమారియం, గాడోలినియం, టెర్బియం, డిస్పోస్రియం, లుటేటియం, స్కాండియం, యట్రియం సంబంధిత వస్తువులతో సహా ఏడు వర్గాల మధ్యస్థ, భారీ అరుదైన ఎర్త్‌లను ఎగుమతి నియంత్రణ జాబితాలో ఉంచారు. ట్రంప్‌ సుంకాలు విధించానే చైనా బెంబేలెత్తి పోలేదు. ధీటుగా ప్రతీకార సుంకాలు విధించింది. అమెరికాకు అవసరమైన అనేక వస్తువుల ఎగుమతులను నిషేధించింది. దీంతో ఇప్పుడు ట్రంప్‌ గిలగిల కొట్టుకుంటున్నాడు. అలాంటి ధైర్యం మనం కూడా చేయాలి. కీలెరిగి వాత పెట్టాలి. ట్రంప్‌ బెదిరింపులకు లొంగకుండా దౌత్యపరంగా హెచ్చరికలు చేయాలి. మనదేశం నుంచి కూడా అనేక రకాల వస్తువులను అమెరికా కొనుగోలు చేస్తోంది. అందులో అత్యంత ముఖ్యమైనవేవో ఉంటాయి. వాటి విషయంలో మనం కూడా చైనా లాగా మంకుపట్టాలి. అప్పుడు ట్రంప్‌ దిగివస్తాడు. అక్కడి భారతీయులకు కూడా ఇది ముఖ్యం. ఎందుకంటే దేశంలో ఇప్పటికే ఆహార ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. అమెరికా సుంకాలు విధిస్తే మన విదేశీ మారక నిల్వలు పడిపోతాయి. ఇప్పటికే దేశీయంగా మన యువత నిరుద్యోగం ఎదుర్కొంటోంది. ఎలాగూ అమెరికాలో ఉద్యోగావకాశాలు తగ్గాయి. యూరప్‌ దేశాల్లోనూ ఇదే దుస్థితి ఉంది. మనతిండి మనం తింటూ..మన పనులను మనం చేసుకుంటే స్వయం శక్తిని అవలంబించుకోవాలి. అదేపనిగా అమెరికా లాంటి దేశాలపై ఆధారపడకుండా చూసుకోవాలి. దేశంలో ప్రస్తుత పరిస్థితులును చర్చించాలి. ఆర్థికంగా అనేక విషయాలు చర్చించాల్సి ఉంది. ప్రధానంగా పెట్రో, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. జిఎస్టీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. నిరుద్యోగం ఇంతని చెప్పడానికి లేదు. ఉద్యోగాల కల్పన, ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాలు అసలు లేకుండా పోయాయి. యువత సర్టిఫికెట్లు పట్టుకుని విదేశాలకు చెక్కేస్తున్నారు. ఈ దేశంలో బతకలేమని కూలీలు గల్ఫ్‌ దేశాలకు వెళుతున్నారు. రైతులకు మద్దతు ధరలు ధైర్యం దక్కడం లేదు. బియ్యం ధరలు అమాంతంగా పెరిగాయి. ఉప్పులు,పప్పులు మొదలు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. గృహసంబంధ సిమెంట్‌, ఇసుక, ఇనుము తదితర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు. సామాన్యులు ఇల్లు కొనుక్కుని బతికే అవకాశం లేకుండా చేశారు.  బ్‌ఆయంకుల రుణాలు కూడా తీల్చి పిప్పి చేస్తున్నాయి. కేవలం ప్రభుత్వం కట్టించే ఇళ్లపై ఆధారపడేలా 

చైనా తెగువను చూసి నేర్చుకోవాలి

చేస్తున్నారు. ఇదంతా కూడా అభివృద్దికి నమూనా ఎలా అవుతుందన్నది చర్చించాలి.  ప్రధాని మోడీ చెబుతున్న వికసిత్‌ భారత్‌ కళ్లముందే వెక్కిరిస్తోంది. బేటీపడావో..బేటీ బచావో నినాదంగా మారింది. అమ్మాయిలు చదువుకునే పరిస్థితి లేదు. వారికి కనీస రక్షణా లేదు. కనీసం బాలికా విద్యకు అవసరమైన రుణాలకు కూడా వెసలుబాటు లేదు. వ్యవసాయాన్ని సాంకేతికతను జోడిరచడంతో  దేశీయంగా ఉపాధి రంగాన్ని పరుగులు పెట్టించాలి. నిజానికి వ్యవసాయ రంగం అతిపెద్ద పరిశ్రమగా పాలకులు గుర్తించడం లేదు. దీనిని గుర్తించి అనుబంధ పరివ్రమలు చేపడితే దేశంలో సగం నిరుద్యోగం పోతుంది. అలాగే దేశీయంగా పంటలకు ప్రాధాన్యం పెరుగుతుంది. నగదు రహిత ఆరోగ్య సేవలు పొందే విధంగా బీమా పథకం అమలు, పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్లలో అన్ని పరీక్షలు, మందులు ఉచితంగా అందించే స్థాయికి వైద్యరంగం బలపడాలి. మహిళలు, యువత, నిరుపేదలు, రైతులు సంక్షేమమే లక్ష్యంగా దేశంలో విధానాలు మారాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలి. స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. దేశాన్ని గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా మార్చి ఉపాధి అవకాశాలు పెంచు తామని బిజెపి చేసిన హావిూలు అమలు చేసుకోవడానికిదే సరైన తరుణం. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మద్దతుగా ముద్ర రుణాలను సరళీకరించాలి. ఈ క్రమంలో వ్యవసాయ ఎగుమతులు పెంచుకోవాలి. మనవద్ద పండుతున్న మిర్చి, పత్తి, పసుపు, అల్లం వంటి వాణిజ్య పంటలను ప్రపంచ దేశాలకు విరివిగా ఎగుమతి చేయడం ద్వారా ఆదాయాలను సమకూర్చు కోవాలి. ఇటీవల ఆక్వా ఎగగుమతులపై ట్రంప్‌ ప్రభావం పడిరది. దానిపై దృష్టి సారించాలి. చైనా లాగా మానవవనరులను ఉపయోగించి వస్తూత్పత్తిని పెంచుకోవాలి. ప్రపంచ దేశాలపై ఆధారపడే విధానం పోవాలి. అప్పుడే దేశం ఆర్థికంగా బలోపతేం కాగలదు. నిరుద్యోగం సమిసి పోగలదు. చైనా తరహాలో కఠినంగా సాగితేనే ఇది సాధ్యమని గుర్తించాలి. 

Views: 96

Latest News