visakha mayor:విశాఖ మేయర్ పీఠం కదిలింది

అవిశ్వాస తీర్మానంపై జగన్ ఆగ్రహం

On
visakha mayor:విశాఖ మేయర్ పీఠం కదిలింది

ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు: జగన్

మేయర్ గొలగాని హరివెంకటకుమార్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు: జగన్

మేయర్ గొలగాని హరివెంకటకుమార్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం
సాయిసూర్య,  ఆంధ్రప్రదేశ్  బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార పార్టీలోకి వైఎస్ఆర్సీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. మరోవైపు మున్సిపల్ కొర్పొరేషన్లను స్వాధీనం చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. దీంతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. బలం లేకున్నా మేయర్ పదవికి లాగేసుకుందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఐతే ఎట్టకేలకు టీడీపీ ఆ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు.  

శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన అవిశ్వాస కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. మేయర్ పై 74 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు. ఇన్ ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ హరేంధిరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కూటమి నేతలు హాజరై ఓటు వేశారు. దీంతో వైసీపీకి చెందిన మేయర్ గొలగాని హరివెంకటకుమార్ పదవి పోయింది. 

దీనిపై మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ జగన్ స్పందించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం...దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. 
ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్‌లో వైసీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను తమ పార్టీవాళ్లు గెలుచుకున్నారని చెప్పారు. టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. టీడీపీకి మేయర్‌ పదవి ఏరకంగా వస్తుంది? అని ప్రశ్నించారు. బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను  తాము మేయర్‌ పదవిలో కూర్చోబెడితే, టీడీపీ అధికార దుర్వినియోగంచేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేసిందన్నారు. పోలీసులతో బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే తమ పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్‌పై టీడీపీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారన్నారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయన్నారు వైఎస్ జగన్. మరి దీన్ని  ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. 

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం, కండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబుగారి కుటిల  ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని నిలబడుతున్న  తమ పార్టీ నేతలకు అభినందనలు తెలుపతున్నానని పోస్టు పెట్టారు.

Views: 12

Latest News