Telugu Panchangam - తెలుగు పంచాంగం - తిథి, వారం ,నక్షత్రం ...
ఈరోజు తిథి పంచాంగం వివరాలు తెలుసుకోండి
4.jpg)
ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 27 - 03 - 2025,
వారం ... బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
బహుళ పక్షం,
తిథి : త్రయోదశి రా9.02 వరకు,
నక్షత్రం : శతభిషం రా10.54 వరకు,
యోగం : సాధ్యం ఉ7.23 వరకు,
తదుపరి శుభం తె4.47 వరకు,
కరణం : గరజి ఉ9.49 వరకు
తదుపరి వణిజ రా9.02 వరకు,
వర్జ్యం : ఉ6.43 - 8.15
మరల తె4.59 నుండి,
దుర్ముహూర్తము : ఉ10.30 - 10.51,
మరల మ2.53 - 3.42,
అమృతకాలం : మ3.57 - 5.30,
రాహుకాలం : మ1.30 - 3.00,
యమగండం : ఉ6.00 - 7.30,
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 6.03,
సూర్యాస్తమయం: 6.07,
నేటి మాట
భగవంతుని అనుగ్రహ ఆశీస్సులు పొందాలంటే !!!
దేవుని గుడికి పోయి నమస్కారాలు, ప్రదక్షిణలు చేసేసి హుండీల్లో సొమ్ము వేసేసినంత మాత్రాన దేవుని మెప్పించలేము!!...
వారానికో నెలకో ఒకసారి మాత్రమే దేవుని గుర్తు చేసుకుని మిగతా సమయంలో ప్రాపంచిక సుఖాల్లో మునిగి పోయేవారి పూజలు, సేవలు ఆయనకు అక్కరలేదు!!..
ఆయన అనుగ్రహము కూడా వారానికో , నెలకో ఒకసారి వుంటుంది...
మరి ఏమి చేయాలి???
నీకున్న దాంట్లో కొంత దీనులకు, పేదలకు పంచిపెట్టు...
వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వాచ్చావు, పోయేటప్పుడు ఏమీ తీసుకెల్లేది ఏమీ లేదు...
మధ్యలో ఆయన ఇచ్చిన దాంట్లో కొంత ఆయన సేవలకు ఖర్చు చేసి ... వారి ముఖంలో చిన్నపాటి ఆనందాన్ని చూడగలిగలిగితే అది దేవుని ఎంతగానో తృప్తి పరుస్తుంది. అంతే గానీ నేను తీర్థ యాత్రలు చేశాను, ఇన్ని సార్లు పారాయణ చేశాను, ఇన్ని శ్లోకాలు చదివాను...
ఇదంతా దేనికీ పనికి రాదు .... కాయ ఖర్చు లేదు, ఇసుమంత కష్టం లేదు ....
ఇంకా నాకు దేవుడు ఇది చేయలేదు, అది చేయలేదు అని ఆయనను ఆడి పోసుకోవడం తప్ప ఏమీ రాదు...
గ్రహించండి, దీనజన సేవకు మించిన దేశ సేవ, దైవ సేవ లేనే లేదు...
ఇది ఒక్కటి ఆచరిస్తే భగవంతుని అనుగ్రహం ఎంతో పొందవచ్చు...
స్వస్తి🙏...
🥀శుభమస్తు🥀
🙏సమస్త లోకా సుఖినోభవంతు